వ్యాఖ్యానముతో కూడిన ఒక్క నిమిషము నిడివి గల లేఖన పఠనము

క్రొత్త నిబంధన రికవరి వెర్షన్ లో విస్తృతమైన ఫుట్ నోట్లు ఉన్నాయి, ఇవి లేఖనములలో ఉన్న సత్యము ,వెలుగు మరియు జీవమును నొక్కి ఒక్కాణిస్తాయి. పోషణతో కూడిన ఈ అంశము లేఖనము & వ్యాఖ్యానములో చూపించబడినది.

ఒక్క నిమిషము నిడివి గల లేఖన పఠనములు

ఒక్క నిమిషము నిడివి గల వాక్య భాగములను ఇక్కడ విని డౌన్లోడ్ చేసుకోండి లేదా అన్ని భాగములను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.

[waveplayer order=”DESC” info=”none” ids=”43575″]

“ఇదిగో కన్యక గర్భం ధరించి ఒక కుమారుని కనును, ఆయన నామమును ఇమ్మానుయేలు అని పిలిచెదరు” (ఇమ్మానుయేలు అనగా భాషాంతరమున మనతోనున్న దేవుడు అని అర్థము).

మత్తయి 1:23

[waveplayer order=”DESC” ids=”43576″]

ఒక స్త్రీ మిక్కి లి విలువగల అత్తరున్న చలువరాతి బుడ్డి తీసికొని ఆయనయొద్దకు వచ్చి, ఆయన భోజనబల్లయొద్ద కూర్చుండగా దానిని ఆయన తలమీద పోసెను. అయితే శిష్యులు దానిని చూచినప్పుడు కోపముతో మండిపడి, ఈ వృధా ఎందుకు?

మత్తయి 26:7, 8

[waveplayer order=”DESC” ids=”43577″]

ఈమె ఈ అత్తరు నా దేహము మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేసెను. నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో, అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా చెప్పబడునని వారితో అనెను.

మత్తయి 26:12, 13.

[waveplayer order=”DESC” ids=”43574″]

అంతట వారు కపెర్నహూములోనికి వెళ్లిరి. వెంటనే ఆయన సబ్బాతు దినమున సినగోగులోనికి ప్రవేశించి బోధించెను.

మార్కు 1:21

[waveplayer order=”DESC” ids=”43573″]

దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చుచున్నదని పరిసయ్యులు ఆయనను ప్రశ్నించినప్పుడు ఆయన, దేవుని రాజ్యము పరిశీలించుటచేత రాదు. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక, ఇదిగో ఇక్కడనని,అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను.

లూకా 17: 20-21

[waveplayer order=”DESC” ids=”43569″]

ఏలయనగా ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడెను; కృపయు నిజత్వమును యేసుక్రీస్తు ద్వారా వచ్చెను.

యోహాను 1:17

[waveplayer order=”DESC” ids=”43570″]

ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న జనితైక కుమారుడే ఆయనను బయలుపరచెను.

యోహాను 1:18

[waveplayer order=”DESC” ids=”43571″]

మరునాడు యోహాను యేసు తనయొద్దకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపమును తీసివేయు దేవుని గొర్రెపిల్ల!

యోహాను 1:29

[waveplayer order=”DESC” ids=”43572″]

అందుకు యేసు ఉత్తరమిచ్చుచు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనేగాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో మరినిశ్చయముగా చెప్పుచున్నాననెను.

యోహాను 3:3

[waveplayer order=”DESC” ids=”43582″]

వీరందరును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకభావముతో ప్రార్థనలో ఎడతెగక కొనసాగుచుండిరి.

అపొస్తలుల కార్యములు 1:14

[waveplayer order=”DESC” ids=”43583″]

ఇంకను అనేక విధములైన మాటలతో రూఢిగా సాక్ష్యమిచ్చి, మీరు ఈ వంకర తరమునుండి రక్షింపబడుడని వారిని హెచ్చరించెను.

అపొస్తలుల కార్యములు 2:40

[waveplayer order=”DESC” ids=”43564″]

అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశములోనికి తదేకముగా చూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటను చూచి, ఇదిగో ఆకాశములు తెరవబడుటయు, మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను.

అపొస్తలుల కార్యములు 7:55-56

[waveplayer order=”DESC” ids=”43578″]

ఆయనద్వారా మనము విశ్వాసముచేత ఈ కృపలోనికి ప్రవేశమును పొందుకున్నవారమై, అందులో నిలిచియుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయపడుచున్నాము.

రోమీయులకు 5:2

[waveplayer order=”DESC” ids=”43567″]

కనుక మీకు ఆత్మను పుష్కలముగా సరఫరా చేయువాడును, మీ మధ్య మహత్కార్యములు చేయువాడును ధర్మశాస్త్రసంబంధ క్రియల మూలముగా చేయుచున్నాడా లేక విశ్వాసమును వినుట మూలముగా చేయుచున్నాడా?

గలతీయులకు 3:5

[waveplayer order=”DESC” ids=”43566″]

 ఆ సంఘము ఆయన దేహము; సర్వములో సర్వమును నింపుచున్నవాని సంపూర్ణతయైయున్నది.

ఎఫెసీయులకు 1:23

[waveplayer order=”DESC” ids=”43565″]

ఎవనికైనను ఎవనిమీదనైనను ఫిర్యాదు ఉన్నయెడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుకొనుడి; ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించవలెను.

కొలొస్సయులకు 3:13

[waveplayer order=”DESC” ids=”43580″]

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణ తీసుకువచ్చుచు దేవుని కృప ప్రత్యక్షమై

తీతుకు 2:11

[waveplayer order=”DESC” ids=”43579″]

మనము నీతియందు చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన కడుగుదల ద్వారాను, పరిశుద్ధ ఆత్మ నూతనపరచుట ద్వారాను ఆయన మనలను రక్షించెను.

తీతుకు 3:5

[waveplayer order=”DESC” ids=”43568″]

 గనుక మనము సమయోచితమైన సహాయము కొరకు కనికరమును పొందుకొని కృపను కనుగొనునట్లు ధైర్యముతో కృపాసనమును చేరుటకు ముందుకు వద్దాము.

హెబ్రీయులకు 4:16

[waveplayer order=”DESC” ids=”43581″]

ఏది ఆది నుండి ఉండెనో, మేమేది వింటిమో, మా కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఆ జీవ వాక్యమును గూర్చినది

1 యోహాను 1:1