ప్రభువు పనిలో ఆయనకు మనము ఉపయోగపడుట అనేది మన శీలము యొక్క నిర్మాణం చేతనే నిర్ధారించబడుతుంది. మన శీలములోనున్న స్వాభావికమైన మరియు అనవసరమైన మూలకాలు మన ప్రభువు యొక్క సమృద్ధివంతమైన కనికరము మరియు కృప ద్వారా సమూలంగా నిర్మూలించబడాలి. అనుకూమైన గుణలక్షణాలు తప్పక నిర్మించబడాలి, అలవర్చబడాలి, అభివృద్ధిపరచబడాలి. ఉపయోగకరమైన గుణము (తత్వము) ఒక్క రోజులోనే నిర్మించబడజాలదు, అయినప్పటికీ, మనము ప్రభువుయొక్క ప్రభావవంతమైన సేవకులుగా నుండగోరినట్లయితే, ఇది నిర్మించబడవలసిందే. ప్రభువు పనివాని యొక్క శీలము అనే ఈ పుస్తకములో ఒక క్రైస్తవ పనివాడు ఉపయోగకరంగా ఉండుటకు గల కీలకమైన ప్రత్యేక గుణలక్షణాలను గూర్చి వాచ్మెన్ నీ గారు చర్చించుచున్నారు. ప్రభువు పనివాడు తప్పక శ్రద్ధగా ఆలకించువాడును, మనుష్యులను ప్రేమించువాడును, శ్రమను సహించే మనస్సును కలిగియుండువాడును, శరీరమును లోపరచుకొనువాడును, శ్రద్ధాసక్తి గలవాడును, నియంత్రించబడువాడును, స్థిరత్వము గలవాడునై యుండవలెను. ఇందులో ఒకని నిర్హేతుకవాదం, ధనము పట్ల నుండవలసిన వైఖరి వంటి మరిన్ని ఉపయోగకరమైన అంశాలను కూడ వాచ్మెన్ నీ గారు చర్చించుచున్నారు. ఇది ఆంగ్ల భాషలో Normal Christian Worker గా గతంలో ముద్రించబడింది, అయితే సరిక్రొత్తగా తర్జుమా చేయబడిన ఈ సందేశాలు వాచ్మెన్ నీ గారి అసలైన చైనా భాషలో ముద్రించబడిన పేరుతోనే విడుదల చేయబడుచున్నవి.
Reviews
There are no reviews yet.