లేఖనములలో జీవమును గూర్చిన కీలకమైన ప్రత్యక్ష్యత / The Crucial Revelation of Life in the Scriptures
విమోచకునిగానున్న క్రీస్తును గూర్చి అనేకమంది క్రైస్తవులకు తెలుసు, అయితే క్రీస్తును గూర్చి ఇంతకంటే దేవునికి అత్యంత ప్రాముఖ్యమైన ఒక పార్శ్వము బైబిలునందు బయలుపరచబడినది, గాని బహుమంది విశ్వాసులు దీనిని చాల కొద్దిగానే గ్రహించుచున్నారు. లేఖనములలో జీవమును గూర్చిన కీలకమైన ప్రత్యక్షత అనే ఈ పుస్తకములో విట్నెస్ లీ గారు క్రీస్తును జీవముగా ఎరుగుట మరియు అనుభవించుట అనే కేంద్రీయమైన బైబిలు సత్యమును గూర్చి మాట్లాడుచున్నారు. ఈ సత్యమును మన ముందుంచడముతోపాటు మనమెలాగున ‘‘మన జీవమైయున్న క్రీస్తు’’ ను ఆస్వాదించగలము అనేదానికి చెందిన అనేకమైన అచరణీయమైన ఉదాహరణలు ఇవ్వబడినవి. దేవుని సృష్టిలోనికి పాపము ప్రవేశించడానికి ముందు కూడ దేవుడు తన్నుతానే జీవముగా మానవునికి ఇచ్చుకోవాలనే ఆయన కోరికను గూర్చి పరిశుద్ధ లేఖనాలు మాట్లాడుచున్నవి. భూమిపై మానవుడు ఆయనను వ్యక్తపరచి, ఆయనకు ప్రాతినిధ్యము వహించాలనేదే దేవుని కోరిక. జీవముగా క్రీస్తును అనుభవించి, ఆస్వాదించుట ద్వారా ఈ గురివైపు మానవుడు పురోభివృద్ధి చెందుట కొరకు ఈ మార్గాన్ని మరల తెరిచింది క్రీస్తుని విమోచనే. జీవముగా క్రీస్తు లభ్యమగుట అనేది బైబిలంతటిలో క్రమముగా అంతకంతకు బయలుపరచబడినది. మన జీవ సరఫరాగానున్న క్రీస్తును గూర్చిన అనేకమైన సాదృశ్యాలను పాత నిబంధన తెలియజేస్తుంది, జీవపు ఆత్మ చేత ఆయన జీవమునందు విశ్వాసులు రక్షించబడుటను గూర్చి క్రొత్త నిబంధన స్పష్టముగా మాట్లాడుతుంది. జీవమునిచ్చు ఆత్మ ద్వారా విశ్వాసులు నూతనపరచబడుదురు, పరిశుద్ధపరచబడుదురు, అభిషేకించబడుదురు, బలపరచబడుదురు, తుదకు ఆయన సమిష్టి వ్యక్తతగా క్రీస్తు దేహములోనికి నిర్మించబడుదురు. మనమందరము ఈ కీలకమైన ప్రత్యక్షతను చూచెదము గాక.
Reviews
There are no reviews yet.