మన నిత్యుడగు దేవునికి ఒక నిత్యమైన ప్రణాళిక యున్నది. ఆయన ప్రణాళిక కేవలం మన వ్యక్తిగత ఆశను, కోరికను తీర్చుకొనుట కంటే ఎంతో మించియున్నది. దేవునికి తన స్వంత కోరిక, అనగా తన స్వంత లక్ష్యము ఉన్నది: తిరుగుబాటు యొక్క ప్రతి జాడయు ఈ విశ్వమునుండి తొలగించబడి, సమస్త విషయాలు క్రీస్తు నందు నడిపించబడే వరకు ఆయన తృప్తిపరచబడడు. దేవుని నిత్య ప్రణాళిక యొక్క నెరవేర్పులో సంఘము యొక్క పాత్ర కీలకమైనది. దేవునికి మరియు తన శతృవైన సాతానుకు మధ్య జరిగే పోరాటం నడుమ సంఘము ఇది వరకు ఎన్నడులేని విధంగా నేడు ఉన్నది. ఈ పోరాటం సాతాను యొక్క తిరుగుబాటుతో మొదలై, మనిషిని సాతాను పాడుచేయుటతో పట్టు విడువక కొనసాగుతూ, సిలువపైని క్రీస్తు మరణపు ప్రభావాన్ని అనుభవించుటకును, అన్వయించుటకును సంఘము ప్రయత్నించుచుండగా ఈ పోరాటం నేటి వరకు కొనసాగుతూనే ఉన్నది. సాతానుని ఓడించుట కొరకైన బాధ్యత ఇప్పుడు సంఘము మీదనే ఉన్నది, ఇదిట్లుండగా భూమి మీద దేవుని అభీష్ఠం పురోభివృద్ధి చెందుటకు మరియు సైతానీయ ప్రభావం యొక్క ప్రతి అవశేషమును నామరూపాలు లేకుండ చేయుటకు సంఘము ప్రతిరోజు తప్పక ప్రత్యక్షతను వెదకాలి మరియు ప్రార్థించాలి. దేవుని నిత్య ప్రణాళిక అనే ఈ పుస్తకములో వాచ్‌మెన్ నీ గారు దేవుని నిత్య ప్రణాళికను నెరవేర్చుటలో మానవుని యొక్క విశిష్టమైన స్థానమును మరియు సంఘము యొక్క విశేషాధికారము గల స్థానమును బయలుపరుస్తున్నారు. సంక్షిప్తమైనవి, అయినప్పటికీ వెలిగింపునిచ్చే ఈ సందేశాలలో సమస్త విషయాలు క్రీస్తునందు నడిపించబడుటకు సామాన్యముగా మానవుని ద్వారాను, ప్రత్యేకముగా సంఘము ద్వారాను పని చేయుటకు దేవుడు ఎలా మనలను ఏర్పరచుకొనెనో ఆయన చూపించుచున్నారు. మన ప్రభువు నామమును పిలిచే ప్రతి ఒక్కరు దేవుని ప్రణాళిక లక్ష్యము యొక్క నెరవేర్పులో పాలొందును గాక.
Reviews
There are no reviews yet.